Thursday, July 16, 2026

Buy now

పేదల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యత :డాక్టర్‌ చిన్నారెడ్డి

◆ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ చిన్నారెడ్డి
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ​పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ముఖ్య బాధ్యతని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో 110 మంది లబ్ధిదారులకు రూ. 38,84,200 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో భరోసానిస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తూ.. ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండే తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అర్హులైన వారందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నందిమల్ల యాదయ్య, రాజేంద్రప్రసాద్ యాదవ్, కోళ్ల వెంకటేష్, దేవన్న యాదవ్, చంద్రశేఖర్, సహదేవుడు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి.

Related Articles

spot_img

Most Popular