Thursday, July 16, 2026

Buy now

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పంజాగుట్ట: డా.వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా పంజాగుట్ట సిటీ సెంటర్‌లోని డా.వైఎస్సార్ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పేదల సంక్షేమాన్ని పాలనలో ప్రధాన లక్ష్యంగా మార్చిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర ప్రజానేతగా నిలబెట్టిందన్నారు. సామాన్యులతో మమేకమై వారి అవసరాలకు అనుగుణంగా సంక్షేమ విధానాలను రూపొందించిన నాయకుడిగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారన్నారు.

ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, సామాజిక భద్రతా పెన్షన్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు వంటి పథకాలు లక్షలాది పేద కుటుంబాలకు భరోసా కల్పించాయన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుల ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేయడం వైఎస్సార్ రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. రైతు, పేద, బలహీన వర్గాల సంక్షేమమే ఆయన పాలనకు కేంద్రబిందువన్నారు.

డాక్టర్ వైఎస్సార్ జీవితం, ప్రజాసేవా దృక్పథం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular