పెద్దపల్లి : ప్రమాద నివారణ సిబ్బందికి భద్రత సూచనలు పాటించాలని పెద్దపల్లి డిఈ రాజ బ్రహ్మచారి సూచనలు చేశారు. మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి డిఈ రాజ బ్రహ్మచారి ఇటీవల పెద్దపల్లి ఏడిఈగా బాధ్యత చేపట్టిన తోట మల్లేశం వారితో కలిసి పెద్దపల్లి టౌన్-1 సెక్షన్ కార్యాలయాన్ని సందర్శించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే వీలైనంత త్వరగా చూడాలని సూచించారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ప్రతినెల విద్యుత్ బిల్లులను ఆదే నెలలోనే వసూలు చేయాలని తెలిపారు. అన్ని పారామీటర్స్ పైన సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే పెద్దపల్లి టౌన్ అన్నీ పారామీటర్స్ లో ముందు వుండాలని వారు ఆకక్షించారు. ఈ రివ్యూ మీటింగ్ లో అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ సబ్ ఇంజనీర్ శ్రీనివాస్, సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

