Friday, August 14, 2026

Buy now

ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పనిచేసే నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి

* నర్సుల హక్కుల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్‌తో ప్రభుత్వం చర్చించాలి
* తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం బాధాకరమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తనను కలిసిన ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సులతో ఆమె మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు రోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ, అక్కడ పనిచేసే సిబ్బందికి మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కవిత అన్నారు. కనీసం నర్సులు, ఇతర సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేకపోవడం సరికాదని పేర్కొన్నారు.

ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పనిచేసే నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించేలా ప్రభుత్వం వెంటనే యాజమాన్యాలతో చర్చించి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే పనివేళలు, జీతాలు, ఓవర్‌టైమ్ వంటి అంశాల్లో తెలంగాణకు చెందిన ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తూ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్స్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కవిత అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పనిచేసే నర్సులు, ఇతర సిబ్బంది హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.

Related Articles

spot_img

Most Popular