పెగడపల్లి: బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సీత్ల (శీతలా దేవి) పండుగ మహోత్సవం పెగడపల్లి మండలం ఏడు మూటల పల్లె తాండాలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది.
ఈ వేడుకలకు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు , ఆయన గిరిజనులతో కలిసి శీతలా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ…
గిరిజనుల ఆచార వ్యవహారాలు, ప్రకృతిని దైవంగా భావించి పూజించే వారి సాంప్రదాయాలు సమాజానికి ఎంతో ఆదర్శవంతమైనవని కొనియాడారు.గ్రామాలు, తాండాలు చల్లగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని శీతలా దేవిని వేడుకున్నట్లు తెలిపారు.
పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
మారుతున్న కాలంలోనూ తమ విశిష్టమైన గిరిజన సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో బంజారా సోదరుల పాత్ర ఎంతో అభినందనీయమన్నారు.
ఈ మహోత్సవంలో తిరుపతి నాయక్, మాజీ పార్టీ అధ్యక్షులు లోక మల్లారెడ్డి, సీనియర్ నాయకులు గోలి సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాచకొండ ఆనంద్, కాశెట్టి వీరేశం, సాయిని రవీందర్, నాగుల రాజశేకర్ గౌడ్, దేవయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, బంజారా సంఘాల ముఖ్య నాయకులు, తాండా పెద్దలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

