Friday, August 14, 2026

Buy now

బాధితులకు అండగా మెదక్ భరోసా కేంద్రం.. ఘనంగా వార్షికోత్సవం

మెదక్: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల బాధితులకు అండగా నిలుస్తూ, న్యాయం అందే వరకు భరోసా కల్పిస్తున్న మెదక్ భరోసా కేంద్రం వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. గత నాలుగేళ్లుగా భరోసా కేంద్రం అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయ, వైద్య సహాయం, పునరావాస సేవలను ఆయన అభినందించారు.

బాధితుల గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వారికి సత్వర సహాయం అందేలా అన్ని శాఖలతో సమన్వయంతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని భరోసా కేంద్రం సిబ్బందికి అదనపు ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా కేంద్రం అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసిస్తూ, బాధితులకు అన్ని విధాలా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Related Articles

spot_img

Most Popular