ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ఏదులలో ప్రమాదవశాత్తు మృతి చెందిన సురేష్ సాగర్ కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా రూ. 5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పందెం సుఖేందర్ రెడ్డి.. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి సహాయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరశురామ్ యాదవ్, ఎన్ఎస్ యూఐ గోపాల్ పేట మండల అధ్యక్షుడు జానకిరామ్ యాదవ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ యాదవ్, వార్డు మెంబర్ సంపయల రాముడు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

