Thursday, July 30, 2026

Buy now

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం

ప్రజానావ, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: మండల కేంద్రానికి చెందిన బొల్లె చిన్న లక్ష్మయ్య, కమ్మరి రాఘవచారి, పిల్లెల్ల రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పందించారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పందెం సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మేఘన్న అభయహస్తం ద్వారా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరశురామ్ యాదవ్, ఉప సర్పంచ్ శేషిరెడ్డి, ఎన్ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు జానకిరామ్ యాదవ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular