* సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర విజయవంతం చేయాలి
* సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం
పెద్దపల్లి : బిజెపి ప్రజా వ్యతిరేక పాలన పై ఉద్యమించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 10 నుండి 13 వరకు పెద్దపెల్లి జిల్లాలో తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు. శుక్రవారం సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న నయా ఫాసిస్టు విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా సంఘటితం కావాలని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తిరోగమన విధానాలతో దేశ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు నిత్యము దిగజారుతున్నాయని, భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రజా వ్యతిరేక కార్పొరేట్ సామ్రాజ్యవాద అనుకూల మతతత్వ నిరంకుశ అవినీతి బాహ్యమైన పరిపాలనను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని, ధరల పెరుగులను అరికట్టడంలో, ద్రవ్యాల్బణం నియంత్రణలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు ప్రజా సమస్యలపై ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నదనీ, అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఆగస్టు 10 న సుల్తానాబాద్ లో ప్రారంభం అయి 13న గోదావరిఖని లో ముగుస్తుందని అన్నారు. సెప్టెంబర్ 1 న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించే బద్లావు జరూరి, హై చలో ఢిల్లీ ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలోని ప్రతీ మండల కేంద్రం, ప్రతీ గ్రామం వరకు ఈ నెల 10 నుండి 13 వరకు ప్రజా చైతన్య ను విజయవంతం చేయాలని సిపిఐ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గోసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, జిల్లా సమితి సభ్యులు ఆరెపల్లి మానస్ కుమార్, పూసాలా రమేష్, లతో పాటు పెర్క శివ, కుక్క రవి, కల్లేపల్లి శంకర్, బొంకూరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

