శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, సికింద్రాబాద్ – 2026 బోనాల జాతర కార్యక్రమాల షెడ్యూల్ వివరాలు మంత్రి పొన్నం ప్రభాకర్ కి అందించిన ఆలయ చైర్మన్ ,అర్చకులు
దేవస్థానం అందించిన వివరాల ప్రకారం:
అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు)
19-07-2026 (ఆదివారం) సాయంత్రం 4.00 గంటలకు
ప్రధాన బోనాల ఉత్సవం
02-08-2026 (ఆదివారం)
ఉదయం 4.00 గంటలకు
రంగం కార్యక్రమం
03-08-2026 (సోమవారం)
ఉదయం 8.30 గంటలకు
అమ్మవారి గజవాహన ఊరేగింపు
ఉదయం 10.30 గంటల సమయంలో
ఈ ఆషాఢ జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరిన ఆలయ అర్చకులు..
ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని త్వరలోనే ఆషాఢ మాస బోనాలకు సంబంధించి అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్.

