Friday, August 14, 2026

Buy now

“బోనాల జాతర–2026”కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఆహ్వానం

* పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి.. యూట్యూబర్లు, కళాకారుల ఐక్యతపై ప్రశంసలు

జగిత్యాల: జగిత్యాల జిల్లా యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లు, కళాకారులు ఉమ్మడిగా ఈ నెల 11-08-2026న అత్యంత వైభవంగా నిర్వహించనున్న “బోనాల జాతర–2026” మహోత్సవానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

ఈ మేరకు జాతర మహోత్సవ వర్కింగ్ కమిటీ సభ్యులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన “బోనాల జాతర–2026” అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలోని యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లు, కళాకారులు ఒకే వేదికపైకి వచ్చి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. బోనాల పండుగను ఇంతటి వైభవంగా నిర్వహించేందుకు ముందుకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు.

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బోనాల జాతర–2026 వర్కింగ్ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు, పలువురు యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లు, స్థానిక కళాకారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular