Thursday, July 16, 2026

Buy now

భూ రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలి: సీసీఎల్‌ఏ

​ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: భూముల రీ సర్వే ప్రక్రియను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ భూపరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్‌ఏ డి.ఎస్.లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

గురువారం ఆయన హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో భూ రీసర్వే ప్రక్రియ, ‘భూ భారతి’ కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ​వనపర్తి కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్‌తో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి, రీసర్వే ప్రక్రియ వేగవంతానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

Related Articles

spot_img

Most Popular