Thursday, July 16, 2026

Buy now

మండలి విప్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్

ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఈ రోజు శాసన మండలి విప్ గా బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11 గంటలకు శాసనమండలిలోని విప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మండలి చైర్మన్, శాసన సభా స్వీకర్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సమక్షంలో కార్యాలయం ప్రారంభించి, విప్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ , స్పీకర్, మంత్రులు, సహచర విప్ లు అద్దంకి దయాకర్, యొన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, బల్మూర్ వెంకట్ ను అభినందించి, ఆశీర్వాదించారు.

ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీపీసీ అధ్యక్షులు తనపై నమ్మకంతో ఇచ్చిన పదవీబాధ్యతలను సహచర సభ్యుల సహకారంతో, మన్వయం చేస్తూ ప్రజా పాలనలో తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ణతలు తెలిపారు.

తన రాజకీయ జీవితంలో ఇన్నాళ్లు తనకు అండగా నిలుస్తున్న ప్రజలకు, ఎన్ ఎస్ యూ ఐ విద్యార్థి, యువజన నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ణతలు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular