* తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పర్యావరణహిత వినాయక విగ్రహాల పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను ప్రతిష్ఠించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు తోడ్పడవచ్చని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

