Saturday, June 27, 2026

Buy now

మత్తుకు దూరం… భవిష్యత్‌కు చేరువ:రామగుండం పోలీస్ కమిషనరేట్

గంజాయి రహిత తెలంగాణ…రామగుండం పోలీస్ కమిషనరేట్ లక్ష్యం.

రామగుండం: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో డీసీపీలు,ఏసీపీలు, సీఐలు,ఎస్‌ఐల ఆధ్వర్యంలో 2కే రన్‌లు,భారీ అవగాహన ర్యాలీలు, మానవహారాలు,డ్రగ్స్ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు,యువత, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ మద్దతు ప్రకటించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య,క్రీడలు, క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి తమ జీవిత లక్ష్యాలను సాధించాలని అధికారులు పిలుపునిచ్చారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి,ఇతర మాదకద్రవ్యాల వినియోగం,విక్రయం, అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో పోలీసు శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తోంది.డ్రగ్స్,గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 8712671111కు లేదా సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించండిని పిలుపునిచ్చారు.

Related Articles

spot_img

Most Popular