మల్కాజ్‌గిరి: నగరాన్ని మరింత సురక్షితంగా, పరిశుభ్రంగా, ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మల్కాజ్‌గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి, అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి,తో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, మహిళలు మరియు చిన్నారుల రక్షణ, మాదకద్రవ్యాల నియంత్రణ, సీసీటీవీ కెమెరాల విస్తరణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రజల భద్రత, నగర పరిశుభ్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు, మున్సిపల్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, సమస్యలను వేగంగా పరిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఉమ్మడి కార్యాచరణ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

