Monday, October 5, 2026

Buy now

మాచిడి సత్యనారాయణ మృతి.. కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీధర్ బాబు ధైర్యం

హైదరాబాద్: మంథని పట్టణానికి చెందిన మాచిడి రాము గౌడ్ సోదరుడు మాచిడి సత్యనారాయణ అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిమ్స్ ఆసుపత్రికి చేరుకుని మాచిడి సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.

అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Related Articles

spot_img

Most Popular