రాజన్న సిరిసిల్ల : డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.
అంబేద్కర్ కూడలి నుంచి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడటం జరిగింది.
అనంతరం విద్యార్థులతో కలసి డ్రగ్స్ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి తమ భవిష్యత్ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన అవగాహన స్టాల్స్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
జిల్లాలో గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది.
డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 8712671111 లేదా సమీప పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు.

