Friday, July 31, 2026

Buy now

యువత భవిష్యత్తును దోచుకుంటున్న పాలకులపై ఉద్యమిద్దాం

* ​ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర

​ప్రజానావ,ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: యువత భవిష్యత్తును దోచుకుంటున్న పాలకులపై పోరాడాలని, కేంద్రంలోని బీజేపీ నిరంకుశ విధానాలు దేశానికి ప్రమాదకరమని ఎఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తిలోని సీపీఐ కార్యాలయంలో ఎఐవైఎఫ్ వనపర్తి జిల్లా 3వ మహాసభలు మహేష్ అధ్యక్షతన జరిగాయి.
​ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీలో జాప్యం, వలసల వల్ల యువత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. ‘నీట్’ నిర్వహణ లోపాలను సవరించి విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను అడ్డుకోవాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కే. విజయరాములు మాట్లాడుతూ.. యువత సైద్ధాంతిక అవగాహనతో ప్రజా సమస్యలపై ఉద్యమించాలన్నారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బిజ్జ శ్రీనివాసులు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ. కూతుబ్, సురేష్, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular