Tuesday, June 23, 2026

Buy now

యూరియా కొరత లేనేలేదు:ప్రభుత్వ విప్

పెద్దపల్లి : జిల్లాలో 20వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని యూరియా కొరత లేనేలేదు అని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు పేర్కొన్నారు. ఈ వర్షాకాలం పంట సాగుతూ ఎస్సారెస్పీ ద్వారా సమృద్ధిగా మీరు సరఫరా అవుతుందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల, జిల్లా వ్యవసాయ అధికారులతో వానాకాలం సీజన్ దృష్ట్యా పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రారంభమైన వర్షాకాలం సీజన్లో పంటల సాగు వివరాలు,ఎస్సారెస్పీ ద్వారా సంవృద్ధిగా సాగనీరు, యూరియా అవసరం మరియు ప్రస్తుత నిలువలు, యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం గురించి వ్యవసాయ అధికారులతో చర్చించడం జరిగిందని అన్నారు.

జిల్లాలో ప్రస్తుత వానకాలం సీజన్లో పంట అంచనాలకు గాను ఎలినో ప్రభావంతో వరి పంట సాగు తగ్గిపోయే అవకాశం ఉందని జూలై మొదటి వారం లోపు పంట వివరాలను సమర్పించాలని అధికారులకు సూచనలు చేశారు.

జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిలువలు ఉందని జిల్లాలో తగ్గుతున్న సాగుకు అనుకూలంగా యూరియా బస్తాలు ఉంటాయని, యూరియా కొరత అనే అంశానికి తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular