Wednesday, July 15, 2026

Buy now

రామగుండంలో కాంగ్రెస్‌లోకి ఇద్దరు కార్పొరేటర్లు.. BRSకు షాక్

రామగుండం: రామగుండం నియోజకవర్గంలో BRS పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 28వ డివిజన్ కార్పొరేటర్ ధారంగుల కుమార్, 26వ డివిజన్ కార్పొరేటర్ భగవత్ నరసింహ సారయ్య నాయక్‌తో పాటు BRS సీనియర్ నాయకుడు శివరాత్రి గంగాధర్, పలువురు నాయకులు, కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రామగుండం కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు వీటి బాలరాజు, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్, కుందనపల్లి సర్పంచ్ అరుకుటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నాయకత్వంలో ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular