రామగుండం: నియోజకవర్గంలోని హనుమాన్ నగర్లో పట్టణ అధ్యక్షుడు కొలుగూరి సాయి కుమార్ అధ్యక్షతన 9, 37, 38 డివిజన్ల బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రామగుండం నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై బీఎల్ఏలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం BLOల ఇంటింటి సర్వే గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రతి బీఎల్ఏ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల నమోదు, మార్పులు, సవరణల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బూత్ స్థాయిలో పార్టీ నాయకులు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) ఐడీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్, 58వ డివిజన్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి, సీనియర్ నాయకుడు నడిపెల్లి మురళీధర్ రావు, 6వ డివిజన్ కార్పొరేటర్ తోకల రమేష్, మాజీ కార్పొరేటర్ నారాయణదాసు మారుతి, దొమ్మేటి వాసు తదితరులు పాల్గొన్నారు.

