Monday, June 22, 2026

Buy now

రిజిస్ట్రేషన్ సేవలకు తాత్కాలిక విరామం

సర్వర్ నిర్వహణ పనుల దృష్ట్యా ఈ నెల 26 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్ సేవలకు తాత్కాలిక విరామం
జూన్ 29 నుంచి యథావిధిగా సేవలు,స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలు షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

సుమారు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ సర్వర్ నిర్వహణ పనుల ద్వారా సర్వర్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేయడం, భద్రతా ప్రమాణాలు బలోపేతం కావడం, సేవల నాణ్యత మెరుగుపడడం కోసం ఈ తాత్కాలిక విరామం అవసరమని ఆయన పేర్కొన్నారు.
అయితే జూన్ 26న మొహరమ్, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో, మధ్యలో ఉన్న జూన్ 27న ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పని దినంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం అత్యల్పంగా ఉండేలా ఈ షెడ్యూల్ రూపొందించామని తెలిపారు.

ప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, జూన్ 29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు.
శాఖ నిర్వహణ పనులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Related Articles

spot_img

Most Popular