Thursday, July 16, 2026

Buy now

రైతు భరోసా పంపిణీ సదస్సు శిల్పకళా వేదికలో నిర్వహణ

హైదరాబాద్: తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. తొలుత మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసింది.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని శిల్పకళా వేదికకు మార్చారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు రైతు భరోసా పంపిణీ సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, వివిధ రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు.

రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Related Articles

spot_img

Most Popular