ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని టోల్ ప్లాజా సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కాటవరం గ్రామానికి చెందిన ఎరుకలి బాలయ్య (35) మరో వ్యక్తితో కలిసి టీవీఎస్ ఎక్సెల్‌పై వెళ్తుండగా, పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎరుకలి బాబు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడు టోల్ ప్లాజా వద్ద చిన్న హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడని, ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని అడ్డాకుల ఎస్ఐ మురళి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

