పాలకుర్తి, ఆగస్టు 6: తొర్రూరు పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లిటిల్ ఫ్లవర్ సోల్జర్స్ టీమ్‌ను ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యతలను అలవర్చుకుని భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
పాఠశాల యాజమాన్యం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభినందిస్తూ, విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడే ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, పట్టణ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

