Friday, July 31, 2026

Buy now

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు సమన్వయంతో చర్యలు: అదనపు కలెక్టర్ నగేష్

ప్రజానావ,సిరిసిల్ల,: రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వక్ఫ్ ప్రొటెక్షన్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం గురువారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ నగేష్ అధ్యక్షతన నిర్వహించారు.

సమావేశంలో జిల్లా వక్ఫ్ ఇన్‌స్పెక్టర్ జిల్లాలోని వక్ఫ్ ఆస్తులు, భూములు, వాటి పరిరక్షణకు సంబంధించిన సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు తలెత్తిన సందర్భాల్లో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

జిల్లా వక్ఫ్ కమిటీకి చెందిన ఎన్జీవో సభ్యుడు, మహిళా సభ్యురాలు, న్యాయవాది సభ్యుడు ప్రస్తుతం ఉన్న వక్ఫ్ వివాదాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డీఆర్ఓ, సిరిసిల్ల ఆర్డీఓ, వేములవాడ ఆర్డీఓ, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్, వేములవాడ మున్సిపల్ కమిషనర్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జి. కుమారస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే అండ్ ల్యాండ్), సబ్-రిజిస్ట్రార్, జిల్లా వక్ఫ్ కమిటీ సభ్యులు, రాజన్న సిరిసిల్ల జిల్లా వక్ఫ్ ఇన్‌స్పెక్టర్, మైనారిటీ సంక్షేమ శాఖ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular