Wednesday, July 15, 2026

Buy now

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధంగా ఉంచాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల: వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణతో పాటు వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.

గతంలో వివిధ పథకాల కింద నాటిన మొక్కల్లో ఎండిపోయినవి, పెరగని మొక్కలను అటవీశాఖ అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు కురిసిన అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని తెలిపారు.

నీటి పారుదల శాఖ స్థలాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అటవీ ప్రాంతాలు, మున్సిపల్ డంపింగ్ యార్డులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఎక్సైజ్ శాఖ పరిధి, నూతన రహదారుల వెంట మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో నర్సరీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు కలిపి 8,65,200 మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణయించినట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు.

సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా విద్యాధికారి మొండయ్య, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా ఎక్సైజ్ అధికారి హిమశ్రీ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, మైనింగ్ శాఖ ఏడీ క్రాంతి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular