Thursday, July 16, 2026

Buy now

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతాను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతా, ఐపీఎస్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నూతన కమిషనర్‌కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణతో పాటు పోలీస్ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తూ కమిషనరేట్ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.

నూతన బాధ్యతల్లో ఎన్. శ్వేతా ఐపీఎస్ విజయవంతంగా సేవలందించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభిలషించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ప్రజా భద్రతకు చేపట్టే కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular