◆ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి
ప్రజానావ,ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్‌నినో, తక్కువ వర్షపాతం దృష్ట్యా రైతులు వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిలెల్ల చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శనివారం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో జరిగిన అవగాహన సభలో పాల్గొని నీటి లభ్యతను బట్టి కందులు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. పంట మార్పిడి ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని, భూసార పరీక్షలు చేయించి ఎరువుల వాడకం తగ్గించాలని కోరారు. నీటి వృథాను అరికట్టేందుకు బిందు, తుంపర సేద్యం పద్ధతులు పాటించాలని పిలుపునిచ్చారు.

