వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం కలుగుతుందని, అయినప్పటికీ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును అందిస్తామని సింగరేణి ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి పేర్కొన్నారు.
హైదరాబాద్ సింగరేణి భవన్ లో శుక్రవారం తెలంగాణ జెన్ కో ఛైర్మన్ డాక్టర్ హరీష్ సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతిని కలిశారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాపై చర్చించారు. వర్షాకాలంలో యాదాద్రి సహా అన్ని థర్మల్ కేంద్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలగకుండా నాణ్యమైన బొగ్గును తగినంతగా సరఫరాపై చర్చించారు.
సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్ వి. సూర్యనారాయణ(ఆపరేషన్స్), డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, తెలంగాణ జెన్ కో ఈడీ నగ్యా, డైరెక్టర్ రాజశేఖర్, సీఈ లక్ష్మయ్య తదితరులుఅధికారులు పాల్గొన్నారు

