Wednesday, July 15, 2026

Buy now

విద్యను వ్యాపారంగా మార్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్:దేశంలో విద్యా విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాపారంగా మార్చిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

హైదరాబాద్ బోయినపల్లిలో నిర్వహించిన ‘ఛత్రోంకి గూంజ్’ కార్యక్రమంలో ఆయనతో పాటు కార్యక్రమ కన్వీనర్, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ఉద్యోగాలు, విద్యా ప్రవేశాలకు సంబంధించిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థులు, యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.

పరీక్షల నిర్వహణపై పలు ఆరోపణలు వచ్చినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని విమర్శించారు.

విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని పేర్కొంటూ, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Related Articles

spot_img

Most Popular