Sunday, October 4, 2026

Buy now

విద్యార్థుల భద్రతే ప్రాధాన్యం.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి!

* మెదక్‌లో షీ టీమ్స్ అవగాహన సదస్సు.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, T-SAFE యాప్, బాలల అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన

మెదక్: విద్యార్థుల భద్రత, సైబర్ నేరాల నివారణ, షీ టీమ్స్ సేవలపై అవగాహన కల్పించేందుకు మెదక్ సబ్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య హైస్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పలు కీలక అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ.. అనుమానాస్పద స్పర్శలను ఎలా గుర్తించాలి, ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు వెంటనే ఎలా తెలియజేయాలనే విషయాలను వివరించారు.అలాగే సోషల్ మీడియా మోసాలు, ఆన్‌లైన్ గేమింగ్ ప్రమాదాలు, సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా విద్యార్థులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు.మహిళలు, యువతులు అత్యవసర ప్రయాణాల్లో భద్రత పొందేందుకు తెలంగాణ పోలీసులు ప్రవేశపెట్టిన T-SAFE యాప్ ప్రత్యేకతలు, దాని వినియోగ విధానాన్ని అధికారులు వివరించారు.

బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాల నివారణ, పిల్లలకు ఉన్న చట్టపరమైన రక్షణలు తదితర అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపుల నివారణలో షీ టీమ్స్ అందిస్తున్న సేవలు, ఆపద సమయంలో పోలీసులను ఎలా ఆశ్రయించాలనే విషయాలను వివరించారు.సమస్యలు ఎదురైనప్పుడు విద్యార్థులు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని, అవసరమైతే డయల్ 112 ద్వారా పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు.“విద్యార్థుల భద్రతే మా ప్రాధాన్యత” అని మెదక్ జిల్లా పోలీసులు పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular