Friday, August 14, 2026

Buy now

వేములవాడ టెంపుల్ ఏరియా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష

రాజన్న సిరిసిల్ల: వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (VTADA) పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతితో పాటు పనుల్లో వేగం పెంచే అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిని అధికారులు వివరించారు. కొనసాగుతున్న ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా వేగవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా రహదారులు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, ట్రాఫిక్ నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో పనులను వేగవంతం చేసి వేములవాడను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు.

Related Articles

spot_img

Most Popular