* పేదలు, రైతులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ కృషి
* ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.
పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద, సుల్తానాబాద్ మున్సిపల్ మొదటి వార్డు సుగ్లాంపల్లిలో దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళుకల్పించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్ రింగు రోడ్డు, రాజీవ్ రహదారి, ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్థాయిలో నిలిచిపోయారని ఇవి కేవలం పథకాలు, అభివృద్ధి పనులు మాత్రమే కాదని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి దూరదృష్టికి, ప్రజా సంక్షేమ పాలనకు చిరస్మరణీయ చిహ్నాలని అన్నారు.
ఆయన జయంతి సందర్భంగా ఆ మహానేతకు నా ఘన నివాళులు తెలుపుతూ ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

