ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లా కేంద్రంలోని రెండో రైల్వే గేట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘షిఫా మల్టీ స్పెషాలిటీ & చిల్డ్రన్ హాస్పిటల్’ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించారు. అనంతరం హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఎం.డి. షఫీక్.. ఎమ్మెల్యేను, మున్సిపల్ చైర్‌పర్సన్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇదే వేదికపై డాక్టర్ షఫీ కుమార్తె జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో చిన్నారితో కేక్ కట్ చేయించి, ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.

