ప్రజనావ,గోదావరిఖని: సమాజంలో చైతన్యం తీసుకురావడంలో, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల సేవలు అమూల్యమని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు.గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన **”జోహార్ కామ్రేడ్ మూనిర్ (ప్రొలిటేరియన్ జర్నలిస్ట్)”** పుస్తక పరిచయ సభలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్యంగా పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిలబడి కలాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన కామ్రేడ్ మూనిర్ జీవితం, ఆయన విలువలు భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ పుస్తకం రూపొందిందని కొనియాడారు. ఇటువంటి గ్రంథాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
పాత్రికేయులు ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ సమాజాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు రామూర్తి, రియాజ్ అహ్మద్, వెంకట్రావు, శేఖర్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

