ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: నగరంలో ప్రత్యేక ఓటరు సవరణ సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కార్పొరేటర్లందరూ తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి, ప్రజలతో సర్ ఫారాలను నింపించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.

