Saturday, August 15, 2026

Buy now

సిరిసిల్ల అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల: విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీలో భాగంగా స్టోర్‌రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్ బియ్యం, పప్పులు, గుడ్లు తదితర నిత్యావసర ఆహార నిల్వలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీసి పాఠశాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా చదివితే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. చదువుతో పాటు విరామ సమయంలో ఆటలు ఆడుతూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు.

Related Articles

spot_img

Most Popular