Thursday, July 16, 2026

Buy now

సీఎం సహాయనిధి ద్వారా రూ.3.50 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి:ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.3.50 లక్షల ఆర్థిక సహాయ చెక్కును పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లబ్ధిదారునికి అందజేశారు.

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన చింత యాదగిరికి గుండె సంబంధిత వైద్య చికిత్స కోసం మంజూరైన రూ.3,50,000 విలువైన చెక్కును ఎమ్మెల్యే అందించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు అత్యవసర సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

Related Articles

spot_img

Most Popular