Thursday, July 16, 2026

Buy now

సీఎం సహాయ నిధి పేదలకు వరం:ఎంపీ కావ్య

వరంగల్: అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప వరమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో సీఎం రిలీఫ్ ఫండ్ కీలక పాత్ర పోషిస్తోందని ఎంపీ పేర్కొన్నారు..

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ.3,50,000 (మూడు లక్షల యాభై వేల) విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంపీ కడియం కావ్య స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులతో ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడి, ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని ధైర్యం చెప్పారు..

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ,.. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో వైద్య ఖర్చులు భరించడం చాలా కష్టసాధ్యమవుతుందని అన్నారు.

అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం సహాయ నిధి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందని చెప్పారు. ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సి వచ్చినప్పుడు లక్షల్లో ఖర్చు అవుతుండటంతో కుటుంబాలు అప్పుల పాలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని ఎంపీ తెలిపారు. అవసరమైన సహాయం కోసం ప్రజలు ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. కష్టకాలంలో తమకు ఆర్థిక చేయూత అందేలా చొరవ చూపిన ఎంపీ కడియం కావ్యకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

Related Articles

spot_img

Most Popular