Saturday, August 15, 2026

Buy now

సువర్ణ వనమాలకి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నివాళి

పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అత్తమ్మ, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు అక్క, మంథని మాజీ సర్పంచ్ సువర్ణ వనమాల (91) కనుముశారు. మంగళవారం మంథనిలో ఆమె పార్థివ దేహాన్ని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సందర్శించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంతక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సువర్ణ వనమాల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, ఆల్ఫోర్ నరేందర్ రెడ్డి, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular