Saturday, August 15, 2026

Buy now

సూపర్ ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

* రిజర్వాయర్ల నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి – ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి*

సిరిసిల్ల: సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు, ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ, చేనేత జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం నిర్వహించిన సూపర్ ఎల్‌నినోపై సమీక్ష సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు.ఈ సందర్భంగా సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే జిల్లా ఎల్‌నినో ప్రణాళిక, “తెలంగాణ జలసిరి” పేరుతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సూపర్ ఎల్‌నినో ప్రభావం దక్షిణ భారతదేశంపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, వర్షపాతం తగ్గే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటిని వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలకే వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
గత రెండు నెలలుగా తగినంత వర్షపాతం లేకపోవడంతో పంటల సాగు గణనీయంగా తగ్గిందని పేర్కొన్న మంత్రి, వచ్చే నెలలో ఏ పంటలు సాగు చేయడం అనుకూలమో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆరుతడి, స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని, అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి మార్గనిర్దేశం చేయాలని సూచించిన మంత్రి, భూగర్భ జలాల మట్టం గత ఏడాదితో పోలిస్తే రెండు మీటర్లకు పైగా పడిపోయిందని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తెలంగాణ జలసిరి కార్యక్రమం కింద బోర్‌వెల్ రీచార్జ్, ఫామ్ పాండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పాఠశాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు అవసరమైన పంపింగ్ మోటార్లను అదనంగా సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, ఎరువుల కొరతపై తప్పుడు ప్రచారాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రతి అంశంపై పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులు, పంటల మార్పిడిపై రైతులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఏడాది జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 78 వేల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందన్నారు. రైతు భరోసా లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ పంటలపై మొబైల్ సందేశాలు పంపుతున్నామని, ఆగస్టులో సాగు చేయాల్సిన పంటలపై గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు 1,500 ఎకరాల లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటివరకు 400 ఎకరాల్లో సాగు పూర్తయిందని, మిగిలిన లక్ష్యాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులు పకడ్బందీగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్ఓ జయశ్రీ, వేములవాడ ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సీపీఓ శ్రీనివాసాచారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular