Thursday, August 27, 2026

Buy now

సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

* మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో పలువురు మృతి చెందిన విషయం తెలుసుకున్న సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని సూచించారు.ప్రమాద ఘటనపై సంబంధిత అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

Related Articles

spot_img

Most Popular