Wednesday, August 26, 2026

Buy now

సెర్ప్ అధికారులకు హృదయపూర్వక అభినందనలు!

* PMFME పథకంలో తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు

హైదరాబాద్: ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) పథకంలో సీడ్ క్యాపిటల్‌ను స్వయం సహాయక సంఘాలకు సమర్థవంతంగా అందించడంలో తెలంగాణ రాష్ట్రానికి “బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ – ఫస్ట్ రన్నర్ అప్” అవార్డు లభించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

మహిళా సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం గర్వకారణమని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ, వారి స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ అవార్డు నిదర్శనమని తెలిపారు.

సెర్ప్ అధికారులకు ప్రత్యేక అభినందనలు
తెలంగాణ ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, డైరెక్టర్ రజిత, ఇతర అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

స్వయం సహాయక సంఘాల మహిళలకు మరింత ఆర్థిక అవకాశాలు కల్పిస్తూ, మహిళా సాధికారత దిశగా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Related Articles

spot_img

Most Popular