Saturday, August 15, 2026

Buy now

సైబర్ జాగృతి దివస్‌లో అవగాహన కార్యక్రమం

* గోపాలపురం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సెయింట్ మేరీస్ సెంటెనరీ జూనియర్ కాలేజీలో నిర్వహణ
* విద్యార్థులు, అధ్యాపకులకు సైబర్ నేరాలపై అవగాహన
* సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచన

సైబర్ జాగృతి దివస్‌లో భాగంగా గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని “St. Mary’s Centenary Jr. College”, సికింద్రాబాద్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులు, అధ్యాపకులకు వివిధ రకాల సైబర్ మోసాల గురించి వివరించి, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, OTPలను ఎవరికీ చెప్పవద్దని సూచించారు.అలాగే “ఆలోచించి స్పందించండి… సైబర్ మోసాలను నివారించండి” అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే **1930** హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Related Articles

spot_img

Most Popular