◆ డీజీపీ సీవీ ఆనంద్
ప్రజనావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: సైబర్ మోసాల నియంత్రణకు సాంకేతికతతో పాటు ప్రజల్లో అవగాహనే కీలకమని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం డిజిపీ కార్యాలయం నుండి సైబర్ నేరాల నివారణపై కమిషనర్లు, ఎస్పీలు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్‌లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వంటి కొత్త తరహా మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సైబర్ బాధితులు వెంటనే 1930 లేదా NCRP పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే నగదును ఫ్రీజ్ చేసి, తిరిగి అందిచే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి పాల్గొన్న వనపర్తి ఎస్పీ సునితా రెడ్డి జిల్లాలో నమోదైన సైబర్ కేసుల వివరాలను డీజీపీకి వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పీ బాలాజీ నాయక్, సైబర్ క్రైమ్ సీఐ శ్రీను నాయక్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

