Sunday, September 6, 2026

Buy now

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లోక్‌భవన్‌లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం

హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ని మర్యాదపూర్వకంగా కలిశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం లోక్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.

అలాగే పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నగర ప్రముఖులు ఈ ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరయ్యారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, న్యాయవ్యవస్థ, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగింది.

Related Articles

spot_img

Most Popular