ప్రజనావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న తెలుగు భాషా ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో ‘క్లాస్‌మేట్ క్లబ్’ ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్ర్య సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర్ తిలక్ ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం తెలుగు పండితులు బూరోజు గిరిరాజాచారి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆజాద్, తిలక్ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ శివాజీ అధ్యక్షతన, క్లాస్‌మేట్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య ఆధ్వర్యంలో తెలుగు భాషా శిక్షణా కార్యక్రమ ఆర్‌పీలు భానుచందర్, జయంత్ రెడ్డి, రాజారెడ్డి, సుధాకర్ చారి, నరసింహస్వామిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వనపర్తి, గోపాల్‌పేట, పెద్దమందడి, రేవల్లి మండలాల ఉన్నత పాఠశాలల తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

