* పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల
పెద్దపల్లి : హిందూ మహిళల సాంప్రదాయానికి నిదర్శనం ఆషాడ మాస గోరింటాకు వేడుకలని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాడ మాస గోరింటాకు వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఆషాడ మాసంలో పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండిన వారి జీవితం సుఖశాంతులతో ఉంటుందని మహిళల నమ్మకం అన్నారు. ఇలాంటి సాంప్రదాయ వేడుకలు ప్రతి మహిళా జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మన సంస్కృతి మన సాంప్రదాయంగా తెలంగాణ మహిళలు నిర్వహించుకుంటారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, ఫోక్సో న్యాయమూర్తి స్వప్న రాణి, సీనియర్ సివిల్ జడ్జి భవాని, జూనియర్ సివిల్ జడ్జి ఎన్.మంజుల, నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి మట్ట సరిత, పలువురు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

